News August 27, 2025
విజయవాడ: వర్షాలపై VMC అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో VMC అప్రమత్తమైంది. నగరంలో ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి 43 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన్చంద్ర తెలిపారు. డ్రైనేజీలు పొంగడం, కొండరాళ్లు జారడం, రోడ్లపై నీరు నిలవడం వంటి సమస్యల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
Similar News
News August 28, 2025
రాయికల్: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

రాయికల్ మండలం చింతలూరు శివారులో జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో నివసించే సుద్దేవార్ వినోద్ (21) అనే యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ దేవేందర్ తెలిపారు. ఇంటి వద్ద ఖాళీగా ఉండడంతో ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి వెళ్ళిన వినోద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానమన్నారు.
News August 28, 2025
జగిత్యాలలో పెట్రోల్ బంక్ పక్కన గుర్తుతెలియని శవం వెలుగు

జగిత్యాల పట్టణం కరీంనగర్ రోడ్డు వద్ద జితేందర్ రావు పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. నీలి, నలుపు, నారింజ రంగు చొక్కా, నలుపు ప్యాంట్ ధరించిన ఆ వ్యక్తి శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైనా సమాచారం ఉంటే జగిత్యాల టౌన్ పోలీసులకు 8712656815కు తెలియజేయాలని కోరారు.
News August 28, 2025
అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్‌టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.