News February 14, 2025
విజయవాడ: వల్లభనేని వంశీ అరెస్ట్.. ‘నానీ’లు సైలెంట్

వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించడంలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సైలెంట్ అయ్యారు. వీరిద్దరు సైలెంట్ అవ్వడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత YCP ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన కొడాలి, పేర్ని, జోగి రమేశ్‌తో పాటు వల్లభనేని వంశీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకొక్కరిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.
Similar News
News February 24, 2026
క్యాన్సర్‌తో నటుడు, మిస్టర్ ఇండియా మయాంక్ పవార్ మృతి

ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘MTV Splitsvilla’ సీజన్ 7 కంటెస్టెంట్, ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ మయాంక్ పవార్ (37) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఫిట్‌నెస్ మోడల్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ మరణవార్త విని ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం అంటూ నివాళులర్పిస్తున్నారు.
News February 24, 2026
ములుగు జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు

ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో 10 కేంద్రాలు సిద్ధం చేశామని కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. కలెక్టర్ కార్యాలయం మాట్లాడుతూ.. 1,981 మంది ప్రథమ సంవత్సరం, 1,860 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. చీటింగ్ నివారణకు స్క్వాడ్లు, కేంద్రాల వద్ద సెక్షన్ 163 (144) అమలు, జిరాక్స్ షాపులు మూసివేత, త్రాగునీరు–వైద్య సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.
News February 24, 2026
ముందు పోయేది కోడింగ్ జాబ్సే: ఆంథ్రోపిక్ CEO

ఏఐ ఆటోమేషన్ కారణంగా ముందుగా కోడింగ్ ఉద్యోగాలు పోతాయని ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ అంచనా వేశారు. సాఫ్ట్‌వేర్ రాయడంలో ఏఐ సిస్టమ్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ సెన్స్, యూజర్ అండర్‌స్టాండింగ్ వంటివి ఆటోమేట్ కావడానికి కొంచెం సమయం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో 95% పనులు ఏఐ చేస్తుందని జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.


