News April 24, 2025
విజయవాడ: విడదల గోపీ అరెస్ట్‌పై అప్డేట్

మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీకి విజయవాడ జీజీహెచ్‌లో కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులోని స్టోన్ క్రషర్ కంపెనీ నిర్వాహకులను బెదిరించిన ఘటనపై నమోదైన కేసులో గురువారం ఉదయం ACB అధికారులు హైదరాబాద్‌లో గోపిని అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ తీసుకొచ్చిన అధికారులు వైద్యపరీక్షల తర్వాత ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News December 24, 2025
కోస్గి సభతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి

నేడు నారాయణపేట జిల్లా కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సభపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ మరో 20 రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో సభ నిర్వహిస్తామని ప్రకటించడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కోస్గి వేదికగా సీఎం ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల సభలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.
News December 24, 2025
NZB: మరో మూడు రోజులే గడువు

TU పరిధిలోని B.Ed, B.P.Ed మొదటి, మూడవ రెగ్యులర్ సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లింపుకు ఈ నెల 27 ఆఖరు తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ విద్యార్థులకు సూచించారు. జనవరిలో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి సంబంధిత కళాశాలల్లో ఫీజులు చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 29 లోపు కూడా చెల్లించవచ్చన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.
News December 24, 2025
శని పీడలు పోయేందుకు ఏం చేయాలంటే?

శని పీడల నుంచి విముక్తి కోసం శనివారాలు లేదా అమావాస్య నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. హోమాల్లో నువ్వులు సమర్పించాలి. పితృదేవతలకు నువ్వులతో తర్పణాలు వదలాలి. రోజూ ఆదిత్య హృదయం పఠించాలి. సూర్యునికి రాగి పాత్రతో అర్ఘ్యం ఇవ్వాలి. ఫలితంగా సూర్య గ్రహ దోషాలు తొలగుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం కూడా ముఖ్యమే. దీంతో శని దేవుని అనుగ్రహం పొంది కష్టాల నుంచి బయటపడవచ్చు.


