News August 23, 2024
విజయవాడ: విమానంలో మగబిడ్డకు ప్రసవం

సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న దీప్తి అనే మహిళ విమానంలోనే ప్రసవించి. బుధవారం రాత్రి ఆమె సింగపూర్ నుంచి చెన్నైకి బయలుచేరారు. మార్గమధ్యంలో అర్థరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలు, అక్కడున్న మహిళల సాయంతో క్షేమంగా దీప్తికి ప్రసవం చేశారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. విమానం చెన్నై చేరుకోగానే వైద్యబృందం తల్లి, బిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నారన్నారు.
Similar News
News December 23, 2025
కృష్ణా: UPHS, PHCలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు DMHO యుగంధర్ తెలిపారు. UPHSలలో ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్ట్ ఒకటి, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 7, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 4, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు10, PHCలలో ల్యాబ్ టెక్నిషియన్ 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 16, శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు 10 ఖాళీలకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 23, 2025
దశాబ్దాల భూ సమస్యకు మోక్షం.. కలెక్టర్కు సన్మానం

దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 22-A భూ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు కలెక్టర్ బాలాజీను మచిలీపట్నానికి చెందిన ఓ న్యాయవాది సన్మానించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘మీ-కోసం’ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ చొరవతో వందలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు అభినందనీయమని న్యాయవాది కొనియాడారు. ఈ పరిష్కారంతో భూ యజమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
News December 22, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అట్రాసిటీ కేసుల పరిష్కార చర్యలు, దళితవాడల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు.


