News March 22, 2025

విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యం

image

నాయుడుపేట వద్ద సాంకేతిక లోపంతో మెమో ట్రైన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దాని వెనుక వస్తున్న ట్రైన్స్ అన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంఘమిత్ర, హైదరాబాద్, సర్కార్, జైపూర్, బిట్రగుంట ఎక్స్ప్రెస్స్, ఛార్మినార్, గ్రాండ్ ట్రంక్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

Similar News

News September 18, 2025

జనగామ జిల్లాలో నిరుద్యోగుల నిరీక్షణ!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామని చెప్పిన రాజీవ్ యువ వికాసం పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రూ.50వేల యూనిట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా యూనిట్లు కేటాయించకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. జనగామ జిల్లాలో 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు సన్నగిల్లుతున్నాయి.

News September 18, 2025

అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.

News September 18, 2025

ఇది కోట ‘కుక్కల’ బస్టాండ్..!

image

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులను భయపెడుతున్నాయి. దీనికి పైఫొటోనే నిదర్శనం. తిరుపతి జిల్లా కోటలోని RTC బస్టాండ్ లోపల ఇలా పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిచ్చాయి. ఇక్కడ సమయానికి బస్సులు వస్తాయో లేదో తెలియదు గానీ రాత్రి అయితే కుక్కలు ఇలా వచ్చేస్తాయి. పగటి పూట రోడ్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తూ కరుస్తున్నాయి.