News January 19, 2025
విజయవాడ: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమిస్తూ శనివారం తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2024 ఎన్నికలలో బాపట్ల జిల్లా వేమూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్.. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ చేతిలో పరాజయం పొందారు. కాగా అశోక్ నియామకంతో పాటు మరో 5 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను వైసీపీ నియమించింది.
Similar News
News September 13, 2025
గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.
News September 13, 2025
ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
News September 12, 2025
కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.