News October 23, 2025

విజయవాడ-సింగపూర్‌ విమాన బుకింగ్స్‌ ప్రారంభం

image

నవంబర్‌ 10 నుంచి ప్రారంభం కానున్న ‘విజయవాడ-సింగపూర్‌’ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ను ఇండిగో సంస్థ వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. ఈ విమాన సర్వీసులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నడవనున్నాయి. టికెట్ ధర రూ.7,500గా నిర్ణయించారు.

Similar News

News October 23, 2025

మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

image

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>

News October 23, 2025

ఎంజీయూ బీఈడీ ఫలితాలు విడుదల

image

ఎంజీయూ బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్‌లాగ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 4వ సెమిస్టర్‌లో 2,552 మందికి గాను 2,419 మంది (94.79%) ఉత్తీర్ణత సాధించారని సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2వ సెమిస్టర్‌లో 81.14 శాతం విజయం సాధించినట్లు పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సందర్శించాలన్నారు.

News October 23, 2025

భారత్ ఓటమి

image

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్‌దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.