News March 18, 2025
విజయవాడ: సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-లోకమాన్య తిలక్(LTT) మధ్య ప్రయాణించే 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.18519 VSKP- LTT రైలు ఏప్రిల్ 24, నం.18520 LTT- VSKP ఏప్రిల్ 22 నుంచి మౌలాలి, సికింద్రాబాద్‌లో ఆగదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు ఆయా తేదీలలో చర్లపల్లి మీదుగా నడుస్తున్నాయన్నారు.
Similar News
News March 18, 2025
సంగారెడ్డి: ఈతకు వెళ్లిన యువకుడు మృతి

ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి మండలం కల్పగురు శివారులోని మంజీరా డ్యాంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆందోల్ మండలం కుమ్మరిగూడెంకు చెందిన నరేష్ తమ్ముడు నరేంద్రతో కలిసి ఆదివారం మంజీరా డ్యామ్‌కు వెళ్లారు. నరేష్ ఈత కొడుతుండగా నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 18, 2025
భూపాలపల్లి: WOW.. అరుణ వర్ణపు కాంతితో నిండు చంద్రుడు!

అరుణ వర్ణపు కాంతితో నిండు చంద్రుడు దర్శనమిచ్చాడు. మనసు ఉల్లాసపరిచేలా, చూపరులను ఆకట్టుకునేలా మురిపింపజేస్తున్న ఎరుపు వర్ణపు చంద్రుడు దృశ్యం సోమవారం రాత్రి కనిపించింది. కళ్లను కట్టిపడేసేలా ఉన్న నిండు చంద్రుడిని చిట్యాల మండలం కైలాపూర్ గ్రామం వద్ద సెల్ఫోన్ కెమెరాలో బంధించారు. అరుదుగా జరిగే సన్నివేశాల్లో అరుణ వర్ణపు చంద్రుడు కనిపించడం ఒకటని స్థానికులు భావిస్తున్నారు.
News March 18, 2025
ADB: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

ఈనెల 18 నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్‌కు ప్రతిరోజు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రెండు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజు మధ్యాహ్నం 3, రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతాయన్నారు. తిరుగుప్రయాణంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 5 గంటలకు, 11:30 గంటలకు బస్ ఉంటుందన్నారు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.