News March 22, 2024

విజయవాడ: సివిల్ సర్వీసెస్‌లో మహేశ్‌కు కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.

Similar News

News September 3, 2025

కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

image

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.

News September 3, 2025

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

image

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.

News September 3, 2025

పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

image

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్‌ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.