News May 7, 2024
విజయవాడ సెంట్రల్.. NOTA @ 6th PLACE

ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో NOTAకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని ఓటర్లు ఎక్కువమందే వినియోగించుకున్నారు. 1,006 మంది నోటాకు జై కొట్టారు. నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓటింగ్ శాతం పరంగా నోటా 6వ స్థానంలో నిలిచింది. – మీరెపుడైనా నోటాకు ఓటేశారా..?
Similar News
News April 21, 2025
కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.
News April 21, 2025
కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
News April 21, 2025
VJA ఆటోనగర్ లాడ్జీల్లో తనిఖీలు

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.