News December 10, 2025
విజయవాడ: స్నాన ఘాట్లు, కేశఖండనశాలల ఏర్పాటు

దీక్షల విరమణకు విజయవాడ వచ్చే భక్తుల సౌకర్యార్థం స్నాన ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. సీతమ్మవారి పాదాల వద్ద 600, భవానీ ఘాట్ వద్ద 100, పున్నమి ఘాట్ వద్ద 100 మొత్తం 800 షవర్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకునేందుకు సీతమ్మవారి పాదాల వద్ద 10, పున్నమి ఘాట్ వద్ద 2, భవానీ ఘాట్ వద్ద 2 గదులు సిద్ధం చేశారు. కేశఖండన కోసం మొత్తం 850 మంది నాయి బ్రాహ్మణులను వినియోగిస్తున్నారు.
Similar News
News December 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 13, 2025
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అరెస్టు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత (2023) నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ న్యాయవాది ఖోస్రో అలికోర్డి స్మారక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమెతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళా హక్కుల కోసం పోరాడుతున్న ఆమె గత పదేళ్లలో ఎక్కువ కాలం జైలులోనే గడిపారు. 2024లో తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు.
News December 13, 2025
ములుగు: పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడు కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.


