News May 13, 2024
విజయవాడ: హరిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో హరిత పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఏడు నియోజకవర్గాల పరిధిలోనూ ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 16, 2026
భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News April 15, 2026
టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో మెంబర్లుగా పని చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులైన వర్ల రామయ్యను మరోసారి పొలిట్ బ్యూరో మెంబర్లుగా నియమించారు. జగ్గయపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను కూడా పొలిట్ బ్యూరో మెంబర్‌గా నియమించారు. తాతయ్య గతంలో టీడీపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు.