News September 12, 2025
విజయవాడ: 163కి చేరిన డయేరియా కేసులు

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇప్పటి వరకు మొత్తం 163 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ప్రస్తుతం 92 మంది చికిత్స పొందుతుండగా, 71 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. డయేరియా బాధితులకు ప్రభుత్వం సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తుందని ఆయన వివరించారు.
Similar News
News September 12, 2025
Way2News ఉత్తరాదిలోనూ రాణించాలి: చంద్రబాబు

డిజిటల్ మీడియా రంగంలో వే2న్యూస్ జాతీయ స్థాయిలో రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘వే2న్యూస్ ఓ స్టార్టప్ కంపెనీ. నాలెడ్జ్ ఎకానమీలో 19 ఏళ్ల క్రితమే ఫౌండర్ రాజు వనపాల వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో వే2న్యూస్ రాణిస్తోంది. ఉత్తర భారతదేశంలో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని Way2News కాన్‌క్లేవ్‌లో సీఎం అన్నారు.
News September 12, 2025
జగిత్యాల: బంగారు దొంగల చిత్రం.. సీసీ కెమెరాలో నిక్షిప్తం

జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు మభ్యపెట్టి వృద్ధురాలు గొల్లపల్లి లింగవ్వ మెడలో నుంచి రెండు తులాల బంగారు నగలను ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా సీసీ కెమెరా చిత్రాల్లో, వారు దొంగతనం చేసిన తర్వాత బైక్‌పై వెళ్లే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దొంగలను ఎవరైనా గుర్తిస్తే SI, జగిత్యాల రూరల్ 8712656822కు సమాచారం అందించవచ్చని రూరల్ పోలీసులు తెలిపారు.
News September 12, 2025
15 రోజుల్లో 214 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్

రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో పోకిరీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గత నెల 16 నుంచి 31 వరకు వచ్చిన 228 ఫిర్యాదుల మేరకు 214 మందిని (మేజర్స్ 94, మైనర్స్ 120) పట్టుకున్నారు. వీరందరికి ఎల్బీనగర్ CP క్యాంప్ ఆఫీసులో కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేపట్టారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నాయన్నారు.