News September 20, 2025
విజయవాడ: APCRDA అడిషనల్ కమిషనర్‌గా భార్గవ్ తేజ

APCRDA అడిషనల్ కమిషనర్‌గా అమిలినేని భార్గవ్ తేజ ఐఏఎస్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం CS కె.విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. 2018 బ్యాచ్‌కు చెందిన భార్గవ్ తేజ గతంలో కందుకూరు సబ్ కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్), కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
Similar News
News September 20, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్ఎం

విశాఖ రైల్వే స్టేషన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండుగల రద్దీ కారణంగా రైల్వే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేషన్‌లో మంచినీటి పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్లాట్ ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత పరిశీలించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో శుభ్రత ప్రమాణాలు పాటించాలన్నారు.
News September 20, 2025
నిజామాబాద్: భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్

జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు సంబంధించి జిల్లా వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ అంశాలను చర్చించారు. భూములు కోల్పోయిన రైతులకు అందించాల్సిన పరిహారం, చెల్లింపుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.
News September 20, 2025
సికింద్రాబాద్ మహంకాళమ్మ గుడిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఈరోజు వెల్లడించారు. ఆలయ ఛైర్మన్ రామేశ్వర్‌తో కలిసి ఉత్సవాల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.మద్రాస్ కళాకారుల ద్వారా ప్రత్యేక పూలతో అమ్మవారి అలంకరణ ఉంటుందన్నారు.