News September 7, 2024

విజయవాడ: APSSDC కీలక నిర్ణయం

image

వరద బాధితుల ఇళ్లలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల సేవలు అందించేందుకు APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)యాప్ తీసుకొచ్చింది. APSSDC ద్వారా శిక్షణ పొందిన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు 462 మంది ముందుకొచ్చారని, త్వరలో వీరిని ముంపు ప్రాంతాలకు పంపించి బాధితుల ఇళ్లలో ప్లంబింగ్ తదితర పనులు చేయిస్తామని అధికారులు తెలిపారు.

Similar News

News May 7, 2025

ఉయ్యూరులో ఈనెల 30న జాబ్ మేళా

image

ఈనెల 30న ఉయ్యూరు AG&SG సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు నైపుణ్య అభివృద్ధి అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజ్యూమ్, ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హతల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.

News May 7, 2025

కృష్ణా: బిర్యానీ ప్రయాణం.. బలి తీసుకున్న ప్రమాదం

image

బిర్యానీ తినడానికి వెళ్లిన ప్రయాణం రెండు యువజీవితాలను బలి తీసుకుంది. గురువారం అర్ధరాత్రి మోపిదేవి పరిధిలోని టోల్ ప్లాజా దాటి వస్తుండగా కంటైనర్ బైక్‌ను ఢీకొట్టింది. అవనిగడ్డకు చెందిన భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ యువకులు కావడంతో వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!