News January 4, 2025
విజయవాడ : B.tech విద్యార్థి మృతి
విజయవాడలోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా గత వారం రోజుల క్రితం విద్యార్థిని HOD మందలించడంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ .. మృతి చెందగా యాజమాన్యం కాలేజీకి సెలవు ప్రకటించింది. కారణమైన హెచ్.ఓ.డి. ని సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 6, 2025
సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ఇది మీకోసమే.!
కైకలూరు, గుడివాడ, విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)- కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07031 CHZ-CCT రైలు ఈనెల 8,10,12,14న, నం.07032 CCT-CHZ రైలు ఈనెల 9,11,13,15న నడుపుతామన్నారు. ఈ రైళ్లు చర్లపల్లిలో పై తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి తరవాతి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్ చేరుకుంటాయన్నారు.
News January 6, 2025
కృష్ణా: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్& సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఈనెల 29 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
News January 6, 2025
నేడు తాడేపల్లి చేరుకోనున్న మాజీ సీఎం జగన్
బెంగుళూరు వెళ్లిన మాజీ సీఎం జగన్ సోమవారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 5.20కి ఆయన బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకుంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం 5.30కి గన్నవరంలో రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి మాజీ సీఎం జగన్ చేరుకుంటారని ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.