News May 14, 2024
విజయవాడ: ICU నుంచి వచ్చి ఓటేశారు
కృష్ణా జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. ఓ వ్యక్తి ఏకంగా ఐసీయూ నుంచి వచ్చి ఓటేశారు. విజయవాడకు చెందిన గోవాడ వెంకటశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న పోలింగ్ డే కాగా, విజయవాడ సెంట్రల్‌లోని 131వ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News November 30, 2024
కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు
గుంతకల్ డివిజన్‌లో భద్రతా పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు డిసెంబర్ 6న, నం.22884 YPR-PURI రైలు డిసెంబర్ 7న నంద్యాల-డోన్ మీదుగా కాక నంద్యాల-ఎర్రగుంట్ల మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2రైళ్లు డోన్‌లో ఆగవని తెలిపారు.
News November 30, 2024
విజయవాడ: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నిరాకరించడంతో సూసైడ్
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదంగా మారిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు కాలువలో దూకిన యువతి కోసం గవర్నర్‌పేట పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా సీఐ అడపా నాగమురళి మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని శుక్రవారం రామవరప్పాడులో ఏలూరు కాలువకట్ట వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
News November 30, 2024
ఎన్టీఆర్ జిల్లాలో 4,600 మందికి ఉపాధి కల్పించాం: బీజేపీ
కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్(JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ బీజేపీ తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని బీజేపీ తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.