News October 8, 2025

విజయవాడ: RTC పైసా వసూల్..!

image

దసరా సందర్భంగా విజయవాడ PNBSకు SEP 24 నుంచి OCT 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.20.20 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 40 లక్షల మంది పండుగ రోజుల్లో రవాణా చేశారు. PNBS పరిధిలో మొత్తం 750 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక గత ఏడాది కేవలం 20 లక్షల మందే ట్రావెల్ చేయగా.. రూ.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఉచిత బస్సు పథకం వల్ల 50% ప్రయాణికులు సంఖ్య, 25% ఆదాయం పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 30, 2026

పురుషుల కంటే మహిళల జీతాలే పెరిగాయి: సర్వే

image

పురుషులతో పోలిస్తే మహిళల నామినల్ వేతనాల్లో వృద్ధి ఎక్కువగా ఉందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(PLFS-2025) తెలిపింది. 3 విభాగాల(స్వయం ఉపాధి, ఉద్యోగులు, కార్మికులు) వారీగా ఈ సర్వే చేసింది. ‘స్వయం ఉపాధి చేసుకునే పురుషుల సంపాదన 6%, మహిళల ఆర్జన 8.8% పెరిగాయి. ఉద్యోగుల్లో పురుషుల జీతం 5.8%, మహిళల శాలరీ 7.2% పెరిగాయి. లేబర్ విభాగంలో పురుషుల వేతనం 0.2% తగ్గగా, మహిళల కూలీ 5.4% పెరిగింది’ అని పేర్కొంది.

News March 29, 2026

ఫోన్‌లో 100% ఛార్జింగ్ మంచిదేనా?

image

ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదని ఎక్స్‌పర్టులు హెచ్చరిస్తున్నారు. ‘100%’లో ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉండటం వల్ల బ్యాటరీలపై అధిక వోల్టేజ్ ఒత్తిడి పడుతుందని అంటున్నారు. దీంతో బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుందని, 10-15 శాతం వరకు లైఫ్ పడిపోతుందని చెబుతున్నారు. 20-80% మధ్య ఛార్జింగ్ ఉంటే ఫోన్లు ఉత్తమంగా పని చేస్తాయంటున్నారు. అత్యవసర సమయాల్లో ఫుల్ ఛార్జ్‌తో వాడుకోవచ్చని సూచిస్తున్నారు.

News March 29, 2026

నార్సింగిలో దారుణం: అన్నం అడిగినందుకు డ్రైవర్ హత్య

image

నార్సింగిలోని స్టార్ విల్లాస్‌లో భోజనం విషయంలో జరిగిన చిన్న గొడవ డ్రైవర్ ప్రాణం తీసింది. ఒకే ఇంట్లో పనిచేసే డ్రైవర్ కార్తీక్, వంటవాడు భాష మధ్య మద్యం మత్తులో మాటామాటా పెరిగింది. ఆకలిగా ఉందని కార్తీక్ అడగగా, ఆగ్రహించిన వంటవాడు భాష కత్తితో దాడి చేయడంతో కార్తీక్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.