News November 23, 2025

విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారా?

image

వైసీపీ ఓడిపోయిన అనంతరం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం వైసీపీ హయంలో పెద్ద ఎత్తున లిక్కర్‌ స్కాం జరిగిందని ఆరోపణలు చేసిన ఆయన బీజేపీలో చేరతారని వార్తలొచ్చినా అది జరగలేదు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న ఆయన ఆదివారం శ్రీకాకుళంలో జరిగే రెడ్డిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తి నెలకొంది.

Similar News

News November 23, 2025

VZM: అక్కడ చురుగ్గా పనులు.. ఇక్కడ మాత్రం..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి వంతెనలు చాలా ఉన్నాయి. వాటిలో సీతానగరం, పారాది, కోటిపాం ప్రధానమైనవి. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ వంతెనలపై నుంచి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే వాహనాల రద్దీ పెరగడంతో వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పారాది, సీతానగరం వద్ద కొత్త వంతెనల పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ కోటిపాం వంతెన పనులకు అడుగులు పడకపోవడం గమనార్హం.

News November 23, 2025

యాలాల: పెళ్లింట విషాదం.. పెళ్లికూతురి తండ్రి మృతి

image

కూతురు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రికి అనుకోని ప్రమాదం జరిగింది. సంగంకుర్డు గ్రామానికి చెందిన అండాల అనంతయ్య తన కూతురి పెళ్లి ఆదివారం నిశ్చయించారు. పెళ్లికి ముందు ఇంట్లో బంధువుల సందడి నెలకొన్న సమయంలో, అనంతయ్య బైక్ పైనుంచి పడి, తీవ్ర గాయాలతో మృతి చెందారు. పెళ్లికి వచ్చిన వారే అంత్యక్రియల్లో పాల్గొనడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

News November 23, 2025

రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

image

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.