News January 6, 2026

విజయ్‌కు కొత్త చిక్కులు

image

తమిళ స్టార్ హీరో విజయ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన చివరి సినిమాగా పేర్కొంటున్న ‘జన నాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కావాల్సి ఉండగా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. దీనిపై మూవీ టీమ్ కోర్టును ఆశ్రయించగా రేపు విచారణ జరగనుంది. మరోవైపు టీవీకే పార్టీ మీటింగ్ ర్యాలీలో <<18778497>>తొక్కిసలాట<<>> ఘటన కేసు CBIకి చేరింది. దీనిపై ఈ నెల 12న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News February 14, 2026

శివరాత్రి: పూజలో వాడకూడని వస్తువులివే!

image

శివపూజలో కొన్ని వస్తువులు నిషిద్ధం. బ్రహ్మదేవుని అబద్ధానికి సహకరించినందుకు మొగలి పువ్వు, జలంధర సంహార కారణంగా తులసి దళాలు శివ పూజకు వాడరు. శివుడు వైరాగ్యమూర్తి కావడంతో సౌభాగ్య చిహ్నాలైన పసుపు, కుంకుమలు లింగంపై నిషిద్ధం. అయితే పానవట్టంపై వాడొచ్చు. అలాగే కొబ్బరికాయ సమర్పించినా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయరాదు. వీటికి బదులుగా విభూతి, బిల్వదళాలు, పాలు, గంగాజలంతో పూజించాలి. తద్వారా సకల శుభాలు కలుగుతాయి.

News February 14, 2026

పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలడానికి కారణాలు

image

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.

News February 14, 2026

DMHO చిత్తూరులో ఉద్యోగాలు

image

AP: నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా DMHO చిత్తూరు 7 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(CS), BE, డిగ్రీ, డిప్లొమా, మెడికల్ గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా(మైక్రోబయాలజీ, వైరాలజీ, పాథాలజీ, ల్యాబ్ సైన్స్), BSc(MLT), ఇంటర్ వొకేషనల్ కోర్సు అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in