News January 27, 2026

విజయ్ ‘జననాయకుడు’ సినిమాకు షాక్

image

హీరో విజయ్‌ నటించిన జననాయకుడు సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్‌ ఇవ్వాలన్న సింగిల్‌ బెంచ్ తీర్పును మద్రాస్ HC చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. వివాదాన్ని మళ్లీ అక్కడే తేల్చుకోవాలని మేకర్స్‌ను ఆదేశించింది. CBFC ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై మేకర్స్ HCకి వెళ్లారు. దీంతో సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్‌ బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై బోర్డు DIV బెంచ్‌కు వెళ్లింది.

Similar News

News February 14, 2026

నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

image

రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో నిన్న తెలుగులో రిలీజైన మలయాళ మూవీ ‘చథా పచ్చ’ వారానికే OTTలోకి రానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ రూ.30కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ హీరో మమ్ముట్టి ఇందులో అతిథి పాత్రలో మెరిశారు. రెజ్లింగ్ క్లబ్ ఏర్పాటులో ముగ్గురు అన్నదమ్ములకు ఎదురైన సవాళ్ల ఇతివృత్తమే కథ.

News February 14, 2026

కొత్తగూడెంపై కమ్యూనిస్ట్ జెండా.. CPIకి కాంగ్రెస్ మద్దతు!

image

TG: హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్‌‌పై అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి మద్దతు తెలుపుతూ మేయర్ పీఠం ఆఫర్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై కమ్యూనిస్ట్ జెండా ఎగరనుంది. అటు ఇప్పటికే తామూ CPIకి మద్దతు ఇస్తామని BRS ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.

News February 14, 2026

18 బంతుల్లోనే 50 రన్స్..

image

T20WCలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా(3 ఓవర్లు) 50 పరుగులు చేసిన రెండో టీమ్‌గా నిలిచింది. మార్క్రమ్ 14 బంతుల్లో 41, డికాక్ 4 బంతుల్లో 9 రన్స్ కొట్టారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 2.5 ఓవర్లలోనే 50 బాదింది. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో SA పవర్ ప్లే ముగిసే సమయానికి 83/1 స్కోర్ చేసింది.