News January 8, 2026

విజయ్ ‘జననాయగన్’ వివాదం ఏంటంటే?

image

నిర్మాత సెన్సార్ సర్టిఫికెట్ కోసం DEC 19న CBFCకి సినిమా చూపించారు. కొన్ని కట్స్ చేసుకొని వస్తే U/A సర్టిఫికెట్ ఇస్తామని బోర్డు చెప్పడంతో మార్పులు చేసి 24న మూవీని సబ్మిట్ చేశారు. కానీ బోర్డు నుంచి రెస్పాన్స్ లేదు. మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉందంటూ సినిమాను JAN 5న రివైజింగ్ కమిటీకి పంపారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సర్టిఫికెట్ త్వరగా ఇచ్చేలా ఆదేశించాలని ప్రొడ్యూసర్ <<18789554>>కోర్టును<<>> ఆశ్రయించారు.

Similar News

News February 1, 2026

ఆ మూడు కర్తవ్యాలతోనే బడ్జెట్ రూపొందించాం: ఆర్థికమంత్రి

image

ఈసారి కేంద్ర బడ్జెట్‌ను మూడు కర్తవ్యాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రోత్ పెంచడం, సమ్మిళిత అభివృద్ధి, తగిన సంస్కరణలతో ఆ వృద్ధిని కొనసాగించడం అనేవి మూడు కర్తవ్యాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు ఇవి సహాయపడతాయని తెలిపారు.

News February 1, 2026

సిట్ విచారణ.. ఫాం‌హౌస్ నుంచి బయలుదేరిన KCR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావడానికి BRS అధినేత KCR ఎర్రవెల్లి ఫాం‌హౌస్ నుంచి HYDలోని నందినగర్ నివాసానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.30గంటలకు ఆయన ఇంటికి చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఫాంహౌస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోగా వారికి అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను సిట్ విచారించనుంది.

News February 1, 2026

7 హైస్పీడ్ రైళ్లు.. హైదరాబాద్‌కు అగ్ర తాంబూలం!

image

దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 3 హైదరాబాద్ మీదుగా నడవనున్నాయి. ముంబై-పుణే, హైదరాబాద్-బెంగళూరు, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి మధ్య ఇవి నడవనున్నాయి. వచ్చే ఐదేళ్లలో 20 కొత్త జల మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.