News February 27, 2026

విజయ్ భార్య విడాకుల పిటిషన్.. రాజకీయ కుట్ర?

image

హీరో విజయ్‌ భార్య సంగీత విడాకులు కోరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఓ నటితో ఆయనకు సంబంధం ఉన్నట్లు 2021లోనే గుర్తించానన్న ఆమె.. ఇప్పుడు కోర్టుకెక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ప్రత్యర్థులు దీన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Similar News

News February 28, 2026

పెదవులు నల్లగా మారాయా?

image

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్​ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.

News February 28, 2026

భారత్‌పై వరుస సెంచరీలు.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మిచెల్

image

ఈ ఏడాది జనవరి నెలకు గాను న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్‌ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించింది. భారత్‌తో ODI సిరీస్‌లో మిచెల్ 2 సెంచరీలు, ఒక ఫిఫ్టీతో రాణించారు. మొత్తం 352 రన్స్ చేసి NZ 1-2 తేడాతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తారీ నిలిచారు. ఆమె జనవరిలో ఆడిన 6 మ్యాచుల్లో 229 రన్స్ చేశారు.

News February 28, 2026

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

image

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం <<19263875>>ఘటన<<>> నేపథ్యంలో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయనగరం నుంచి కాకినాడకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వేట్లపాలెం చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడనున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఘటనాస్థలానికి బయల్దేరారు.