News March 6, 2026

విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎంతంటే?

image

విజయ్ దేవరకొండ-రష్మిక తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో 4 రోజుల వేడుకల నుంచి హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు వరకు రూ.15-20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కోసం 3 కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు టాక్. వివాహ బాధ్యతను ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ చూసుకోగా, వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Similar News

News March 9, 2026

చిరంజీవి రాంగ్ టైమ్‌లో పార్టీ పెట్టారు: శివాజీ

image

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై నటుడు శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ పెట్టి ఉండాల్సింది. అలా అయితే సీమాంధ్రలో కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవారు. రాంగ్ టైమ్‌లో పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల వరకైనా పార్టీని కొనసాగించి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేవారేమో’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News March 9, 2026

ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

image

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.

News March 9, 2026

గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

image

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.