News February 28, 2026
విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?

పెళ్లిలో విరోష్ జంట నగలను HYDకు చెందిన ఓ జువెలరీ సంస్థ 10 నెలల పాటు కష్టపడి డిజైన్ చేసింది. రష్మిక వడ్డాణం, మంగళసూత్రం, గాజులు, నెక్లెస్.. ఇలా 11 రకాల నగల బరువు 1.5-2 కేజీలు ఉంటాయని జాతీయ మీడియా తెలిపింది. వాటి విలువ రూ.3-5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అటు విజయ్ అరకేజీ బరువైన నగలు ధరించగా దాని వాల్యూ రూ.1-2 కోట్లు అని తెలుస్తోంది. విలువైన వజ్రాలు, స్పెషల్ డిజైన్ కారణంగా ధర పెరిగినట్లు సమాచారం.
Similar News
News March 2, 2026
IAFలో అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)లో అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in
News March 2, 2026
సంచలన ఆరోపణ.. మావోలపై విషపు తూటాలు?

నక్సల్స్‌ను అంతం చేసేందుకు ఎన్‌కౌంటర్లలో విషపు తూటాలు వాడారంటూ ఓ మావోయిస్టు అగ్రనేత ‘ఫినిక్స్’ పేరిట రాసిన కథనం సంచలనం రేపుతోంది. ‘బుల్లెట్ షెల్స్ తగిలిన సహచర మావోలు తీవ్రమైన నొప్పి, భరించలేని మంట, విపరీతమైన దాహం, వాంతులతో నరకం అనుభవించారు’ అని పేర్కొన్నారు. గతేడాది ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆయన పార్టీకి రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు.
News March 2, 2026
భారీగా పడిపోయిన టమాటా ధరలు!

రోజురోజుకూ ధరలు పతనం అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.50కి 3-4కిలోలు ఇస్తున్నా తమకు కూలి ఖర్చులు సైతం రావట్లేదని వాపోతున్నారు. నిన్న అనకాపల్లి జిల్లాలో 30 కిలోల టమాటా ట్రే కేవలం రూ.90 పలికినట్లు చెప్పారు. మొంథా తుఫాను వల్ల సాగు ఆలస్యం కావడం, 15 రోజులుగా పంట కోతకు వస్తుండటంతో ధరలు భారీగా తగ్గాయి. మీ ఏరియాలో కిలో టమాటా ధర ఎంత ఉంది?


