News January 9, 2026
విజయ్ సినిమాకు మరో చిక్కు

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ <<18806659>>సినిమాకు<<>> మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించింది. సెన్సార్ కేసు అప్పీల్ విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీనిపై నిర్మాతలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో సినిమా విడుదలకు మరోసారి బ్రేక్ పడింది.
Similar News
News February 17, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 17, 2026
‘జై హనుమాన్’లో కదలిక.. షూటింగ్‌కి రెడీ!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో ‘జై హనుమాన్’ను 2024 అక్టోబర్‌లో <<14492400>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ నెల 22న మూవీ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని హంపికి దగ్గర్లో హనుమాన్‌హల్లిలోని అంజనాద్రి హిల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పాయి. 2024లో రిలీజైన హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కనుంది. ఆంజనేయుడిగా రిషబ్ కనిపించనున్నారు.
News February 17, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 17, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


