News February 24, 2026
విజయ్ సేతుపతి, సాయి పల్లవి క్రేజీ కాంబో!

మణిరత్నం దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోనుంది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ కథను ముందుగా ధనుష్‌కు వినిపించగా వివిధ కారణాలతో ఆయన తప్పుకున్నారట. తర్వాత శింబు, ధ్రువ్ విక్రమ్ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా విజయ్ సేతుపతి ఫిక్సయ్యారు. AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు టాక్.
Similar News
News February 25, 2026
పసుపు పంటలో దుంప తొలుచు ఈగ – నివారణ

పసుపు పంట సుడి దగ్గర ఆకులు వాడి, ఎండిపోయి, లాగినప్పుడు మొవ్వు సులభంగా ఊడొచ్చి, దుంప లోపల బియ్యం గింజల్లాంటి పిల్ల పురుగులు కనిపిస్తే అది దుంప తొలుచు ఈగగా గుర్తించాలి. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మధ్య వేయాలి. సెంటుకు 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలకు అదే పరిమాణం గల ఇసుకతో కలిపి పొలంలో తెగులు ఆశించిన దగ్గర చల్లాలి. అలాగే మొక్కల మధ్య నీరు నిల్వకుండా జాగ్రత్త వహించాలి.
News February 25, 2026
2,551నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీలోని <
News February 25, 2026
ఎందుకలా?!: ఇవి జీవితంలో నీళ్లే తాగవు..

‘కంగారూ ఎలుకలు’ తమ జీవిత కాలం(2-5yrs)లో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. వీటి ఆహారమైన గింజలు, విత్తనాల్లోని తేమతో దాహం తీర్చుకుంటాయి. ఆహారం జీర్ణమయ్యే టైమ్‌లో శరీరంలో ‘మెటబాలిక్ వాటర్’ను తయారు చేసుకుంటాయి. ఒంటెలు, కోలాలు, కొన్ని రకాల కప్పలు నీళ్లు లేకుండా కొన్ని రోజులు/నెలలు బతకగలవు. మనుషులు నీరు తాగకుండా 3-4 రోజులు ఉండగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ 4pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.


