News August 13, 2024
విజయ డైరీ ధ్వంసం చేయడానికి కుట్ర: శ్రీనివాస్ గౌడ్
తెలంగాణలో విజయ డైరీ ధ్వంసం చేయడానికి కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలలుగా విజయా డైరీకి పాలు పోస్తున్న రైతులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హాయంలో విజయా డైరీ లాభాల్లో ఉండే దన్నారు.
Similar News
News November 5, 2024
11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి
పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న కురుమూర్తికి రానున్నారు. సీఎం రాక కోసం మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.
News November 5, 2024
అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత
జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.
News November 5, 2024
NRPT: చిరుతపులి దాడిలో మేకలు మృతి !
నారాయణపేట మండలం గనిమోనిబండ గ్రామ శివారులో చిరుతపులి దాడిలో రెండు మేకలు మృతిచెందాయని బాధితులు పేర్కొన్నారు. వెంకటప్ప తన మేకలను మేత కోసం సోమవారం అడవికి తీసుకెళ్ళారు. వాటిలో రెండు కనిపించకపోవడం మంగళవారం అడవిలో వెతకగా రెండు మేకలు మృతి చెంది కనిపించాయి. చిరుతపులి చేసిన దాడిలో మృతి చెందాయని బాధితుడు వాపోయారు. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అయితే చిరుత సంచారంపై క్లారిటీ రావాల్సి ఉంది.