News September 11, 2025
విజిలెన్స్ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి విశ్వమోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఐదుగురు, ఓసీ, బీసీలకు చెందిన ముగ్గురితో సభ్యుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల వారు బయోడేటా, అనుభవ వివరాలతో ఈనెల 30 సాయంత్రం 5 గంటలలోపు ఏలూరు కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు.
Similar News
News April 5, 2026
KMR: జిల్లాలో చికెన్, మటన్ ధరలు

కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.290 విక్రయిస్తుండగా లైవ్ కోడి రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. మటన్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
News April 5, 2026
IPL: ఇప్పటి వరకు వీళ్లే టాప్!

IPL-19లో ఇప్పటి వరకు 9మ్యాచులు జరగ్గా పలువురు యంగ్ క్రికెటర్లు సత్తా చాటారు. DC ప్లేయర్ సమీర్ రిజ్వీ ఆడిన 2 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో 160పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో రోహిత్(113), కూపర్(108), రఘువంశీ(103) ఉన్నారు. ఇక రవి బిష్ణోయ్(RR) 5 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు. వైశాఖ్ విజయ్ కుమార్ సైతం 5 వికెట్లు పడగొట్టినా ఎకానమీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు.
News April 5, 2026
ఖమ్మం జడ్పీకి 62 ఏళ్లు.. అభివృద్ధి సేవల్లో మైలురాయి

ఖమ్మం జిల్లా పరిషత్‌కు 62 ఏళ్లు పూర్తయ్యాయి. 1964 ఏప్రిల్ 6న కామరాజ్ నాడార్ చేతుల మీదుగా ఈ ZP భవనం ప్రారంభమైంది. 1959లో జరిగిన తొలి ఎన్నికల్లో జలగం వెంగళరావు మొదటి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక పాత్ర పోషిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇప్పటివరకు 12 మంది ఛైర్మన్లు, 49 మంది సీఈవోలు సేవలందించారు. 2014 తొలిసారిగా ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది.


