News December 26, 2025

విజేతగా నిలిచిన భూపాలపల్లి జట్టు

image

HCA, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ-20 క్రికెట్ లీగ్ పోటీల ఫైనల్ మ్యాచ్‌లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలవగా, హనుమకొండ రన్నరప్‌గా నిలిచింది. ఉత్తమ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసిన క్రీడాకారులను క్రికెటర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.

Similar News

News December 28, 2025

గచ్చిబౌలికి గుడ్ బై.. ‘ఫ్యూచర్’ ఈ ఏరియాలదే!

image

మూసీ ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా ఉప్పల్, బాపుఘాట్ ఏరియాలు హాట్ కేకుల్లా మారబోతున్నాయి. 50-60 అంతస్తుల బిల్డింగ్స్‌కు ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే.. పూర్తి స్థాయి డీపీఆర్ (DPR) ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, తెర వెనుక పని జోరుగా సాగుతోంది. రూ.400 కోట్లతో బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌ల ప్లాన్ దాదాపు ఖరారైంది. ఇందుకోసం నిధుల సర్దుబాటు, గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోంది.

News December 28, 2025

జడ్చర్ల: ట్రాక్టర్‌ కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

image

జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అల్లాపురం ఆంజనేయులు కుమారుడు మణిదీప్‌(5) ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్‌ చేయడంతో, అది అకస్మాత్తుగా కదలడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్‌ టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి.

News December 28, 2025

50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

image

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్‌రాజ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.