News December 11, 2025
విత్తన బిల్లును వెనక్కు తీసుకోవాలి: KTR

TG: కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా ఉన్న విత్తన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని BRS నేత KTR డిమాండ్ చేశారు. ‘ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది. రైతులకు పరిహారం గ్యారంటీ లేదు. నకిలీ విత్తనాలకు కంపెనీలను కాకుండా అమ్మకందారులను బాధ్యుల్ని చేసేలా బిల్లు ఉంది. రాష్ట్ర అగ్రి శాఖల్లోని కీలక విత్తనాలు కేంద్ర ఆధిపత్యంలోకి వెళ్తాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 15, 2025
విద్యార్థులకు వేడి ఆహారమే ఇవ్వాలి: మంత్రి

AP: చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని బీసీ సంక్షేమ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, గదుల్లో దోమలు చొరబడకుండా తెరలు వాడాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, ఆ తరువాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని ఉన్నతాధికారుల సమీక్షలో తెలిపారు.
News December 15, 2025
ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

TG: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటికే 394 పంచాయతీలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లుండి(DEC 17) 182 మండలాల్లో మిగిలిన 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. 11 గ్రామాలు, 112 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే.
News December 15, 2025
BJPలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు?

BJP వర్కింగ్ ప్రెసిడెంట్‌గా <<18568919>>నితిన్ నబీన్<<>> బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ పార్టీ రాజ్యాంగంలో ఈ పదవికి ప్రత్యేకంగా చోటు లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. గతంలో జేపీ నడ్డా కూడా ఇదే పదవిలో 6 నెలల పాటు కొనసాగి తర్వాత పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకూ ప్రస్తుత చీఫ్ నడ్డాకు సాయం చేస్తూ పార్టీ వ్యవహారాలను నేర్చుకుంటారు.


