News December 23, 2025
విదేశీ చదువుల్లో AP యువతే టాప్

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో AP యువత దేశంలోనే టాప్‌లో నిలిచింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 2020లో AP నుంచి 35,614 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, పంజాబ్ రెండో స్థానంలో నిలిచింది. ఇందులో తెలంగాణ టాప్ 10లో లేదు. ఇక 2024లో మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కెనడా, US, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలవైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Similar News
News December 23, 2025
రేపట్నుంచి విజయ్ హజారే ట్రోఫీ.. బరిలోకి దిగ్గజాలు!

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. టీమ్ ఇండియా కీలక ప్లేయర్లు పలు మ్యాచ్‌లు ఆడనున్నారు. అయితే కళ్లన్నీ దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ(ముంబై), విరాట్ కోహ్లీ(ఢిల్లీ)పైనే ఉన్నాయి. BCCI <<18575287>>ఆదేశాల<<>> నేపథ్యంలో వీరిద్దరూ కనీసం 2 మ్యాచుల్లో బరిలోకి దిగనున్నారు. T20 WC జట్టులో చోటు కోల్పోయిన గిల్‌తోపాటు రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ కూడా ఆడనున్నారు.
News December 23, 2025
PCOS / PCOD ఒకటి కాదు..

ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు PCOS / PCODతో బాధపడుతున్నారు. అయితే ఈ రెండూ ఒకటే అనుకుటారు చాలామంది. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. మహిళల్లో ఆండ్రోజెన్, టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని PCOSకు దారితీస్తుంది. అండాశయం నుంచి అండం విడుదల కాకుండా అక్కడే ఉండిపోవడంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. దీనినే PCOD అని అంటారు.
News December 23, 2025
నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తాం: CM CBN

భారత్‌లో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి AP నాయకత్వం వహిస్తుందని CM CBN అన్నారు. క్వాంటం, దాని అనుబంధ రంగాల్లో 14లక్షల మంది నిపుణుల్ని తయారు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని ‘క్వాంటం టాక్ బై CM CBN’ కార్యక్రమంలో తెలిపారు. ‘క్వాంటం టెక్నాలజీతో నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి. AP నుంచి ఎవరైనా ఈ టెక్నాలజీ ద్వారా నోబెల్ సాధిస్తే రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.


