News February 28, 2025

విదేశీ పర్యటనలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే

image

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విదేశీ పర్యటనలో చిల్ అవుతున్నారు. చల్లటి మంచు కొండల్లో స్వెటర్ ధరించి కొత్త లుక్‌లో ఫొటోకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అభిమానులు తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో విభిన్నంగా తెలియజేస్తున్నారు. కాగా, ఆయన ఏ దేశంలో పర్యటిస్తున్నారనేది పేర్కొనకపోవడం గమనార్హం.

Similar News

News February 21, 2026

ఇలాంటి పనులతో దేశానికి నష్టం: CBN

image

AP: ఢిల్లీలో జరిగిన AI సదస్సుకు 60కి పైగా దేశాలు వచ్చి ఆవిష్కరణల్ని ప్రదర్శించాయని CM CBN అన్నారు. అలాంటి వాటిని స్వాగతించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బట్టలు విప్పి తిరగడం బాధాకరమని చెప్పారు. ఇది చాలా ఆవేదన కలిగించిందని, ఇలాంటి పనులు దేశానికి నష్టం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. భారత ప్రతిష్ఠను ప్రపంచదేశాల ముందు తగ్గించే చర్యలివి అని మండిపడ్డారు.

News February 21, 2026

PDPL: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

PDPL రీజినల్ టాస్క్ సెంటర్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలోని సెంటర్‌లో జావా, పైథాన్, సీ, సీ++, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, టాలీ విత్ జీఎస్‌టీ, మెడికల్ కోడింగ్, ఆప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు FEB 28లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

News February 21, 2026

యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్‌పై భారత్ ఫోకస్

image

ఈ నెల 25, 26 తేదీల్లో PM మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక, రక్షణ సంబంధాలపై చర్చ జరగనుంది. మోదీ గతంలో ప్రకటించిన ‘మిషన్ సుదర్శన్‌’లో భాగంగా యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి, లేజర్ ఆయుధాలు, లాంగ్‌రేంజ్ మిస్సైల్స్‌పై ఫోకస్ చేయనున్నారు. ఈ రంగాల్లో $10bn డిఫెన్స్ ట్రేడ్‌కు పునాదులు పడనున్నాయి. అలాగే ఆ దేశ PM నెతన్యాహుతో కలిసి మోదీ <<19160160>>పార్లమెంటులో<<>> ప్రసంగించనున్నారు.