News November 27, 2025

విదేశీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం: శ్రీధర్ బాబు

image

విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అనుకూల గమ్యస్థానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఐటీ, ఏరోస్పేస్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా రంగాలకు ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. HYD సచివాలయంలో గురువారం జర్మన్ ఫ్రీడరిక్- ఎబర్ట్- స్టిఫ్టంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు డా.సబీన్ ఫాండ్రిక్ మిర్కో గుంథర్, క్రిస్టోఫ్ మోహ్ర్ చర్చించారు. ఆయనతో పాటు పాటు RGM MLA మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్నారు.

Similar News

News December 1, 2025

రంప ఏజెన్సీలో హై అలర్ట్!

image

డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు PLGA వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టులకు ఆ పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తారు. ఏటా ఈవారోత్సవాలు జరగడం, పోలీసులు అప్రమత్తంగా ఉండడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో ఈసారి రంప ఏజెన్సీలో మరింత హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

News December 1, 2025

జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

image

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.

News December 1, 2025

మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

image

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.