News October 14, 2025
విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వాటిని వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 4 నుంచి నిర్వహిస్తామన్నారు.
Similar News
News October 15, 2025
పిల్లల రక్షణ, విద్యకు పక్కా ప్రణాళిక: కలెక్టర్ హరిచందన

పిల్లల రక్షణ, నాణ్యమైన విద్యాబోధన కోసం క్యాలెండర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని అనుబంధ శాఖల అధికారులను HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ‘క్లాప్'(సిటీ లెవల్ యాక్షన్ ప్లాన్) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణ, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన ఆహారం అందించుటలో ఈ ప్రణాళికలు కీలకం కావాలని ఆమె సూచించారు.
News October 15, 2025
HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్.. 80 వేల కేసుల నమోదు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకుండా సీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జనవరి 1 నుంచి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 2,345 కేసులు నమోదైనట్లు తెలిపారు. No Call Is More Important Than a Life అంటూ ప్రచారం చేస్తున్నారు.
News October 14, 2025
హైదరాబాద్‌లో భారీగా ఇంజీనీర్లు బదిలీ

నీటిపారుదల శాఖలో భారీగా ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 106 మంది అధికారులను బదిలీ చేస్తూ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్క హైదరాబాద్ సర్కిల్‌లో 60 మందికి పైగా బదిలీ అయ్యారు. ఒక్కసారి 106 మంది అధికారులు బదిలీ కావడంతో ఇరిగేషన్ శాఖలో చర్చకు దారి తీసింది. చాలా ఏళ్లుగా అధికారులు ఒకే స్థానంలో ఉండటంతో ప్రభుత్వం ప్రస్తుతం బదిలీ చేసినట్లు సమాచారం.