News November 11, 2025
విద్యతోనే పేదరికం నుంచి విముక్తి: కలెక్టర్

మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. “విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యం” అని ఆయన తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు. మతభేదాలు లేకుండా విద్యను అందించాలనే ఆజాద్ ఆశయాన్ని ప్రస్తావిస్తూ, మైనారిటీ విద్యాఅభివృద్ధికి ప్రభుత్వం గురుకులాలు, బాలికల విద్యపై ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు.
Similar News
News November 11, 2025
WGL: ‘అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100కు కాల్ చేయండి’

ప్రజా భద్రత పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో స్నిఫర్ డాగ్స్‌తో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు ప్రజా రక్షణను పటిష్ఠం చేస్తాయని అధికారులు తెలిపారు.
News November 11, 2025
గ్రామీణ యువత ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రంగంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను మంగళవారం కలెక్టర్ కోయ హర్ష ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలన్నారు. టైలరింగ్, మగ్గం వర్క్ వంటి రంగాలలో శిక్షణ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపర్ణ రెడ్డి, రాకేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
News November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.


