News August 14, 2025

విద్యతోపాటు సాంకేతిక నైపుణ్యం అవసరం: కర్నూలు కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం అందిస్తే ఏ దేశంలో అయినా ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్’ అంశంపై జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో డీఈఓ శామ్యూల్ పాల్‌తో కలిసి పాల్గొన్నారు. వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాధించేందుకు విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు.

Similar News

News August 15, 2025

కర్నూలు జిల్లాలో ఫ్రీ జర్నీ షురూ

image

కర్నూలు జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఆదోనిలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, టీడీపీ నేత మీనాక్షి నాయుడు, కూటమి నేతలు ఉచిత బస్సులను ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో.. ఆధార్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒకటి చూపించి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు.

News August 15, 2025

జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం: మంత్రి

image

జిల్లా సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేద్దామని మంత్రి టీజీ భరత్ అన్నారు. 79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కర్నూలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీతో కలిసి జాతీయ జెండాని ఎగరేశారు. అనంతరం వివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

News August 15, 2025

విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ కృషి: ఎంపీ

image

కర్నూలు మండలం పంచలింగాలలో పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.