News September 19, 2025

విద్యారంగంలో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలి: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాను విద్యారంగంలో ఉన్నతస్థాయిలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం సరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్ బోధనాభ్యాసన సామగ్రి మేళాను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణిస్తారని అన్నారు. విద్యార్థులను ఆకర్షించడానికి అభ్యసన సామగ్రిని తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.

Similar News

News September 19, 2025

VJA: విధుల్లో నిర్లక్ష్యం.. అధికారికి షోకాజ్ నోటీసు

image

ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరగనున్న దసరా మహోత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబుపై కలెక్టర్ లక్ష్మీశా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తన కార్యాలయం ద్వారా రాంబాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.

News September 19, 2025

రాజమండ్రి: ‘సాధారణ జ్వరాలు మాత్రమే..  ఆందోళన వద్దు’

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News September 19, 2025

ఐదుగురు విద్యార్థులకు 9 మంది టీచర్లు!

image

TG: ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొన్ని ప్రాంతాల్లో సర్కారు బడుల్లో చేరే వారి సంఖ్య పెరగడం లేదు. మహబూబాబాద్(D) రాజులకొత్తపల్లి ZPHSలో ఐదుగురు విద్యార్థులకు 9మంది టీచర్లుండటమే ఇందుకు నిదర్శనం. ఈ స్కూలులో 6thలో ఒకరు, 7thలో ఇద్దరు, 8thలో ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. 9th, 10thలో ఒక్కరూ లేరు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.