News September 26, 2025

విద్యార్థికి 4 ఏళ్ల B.Tech జీవితం ఎంతో కీలకం: JNTU వీసీ

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెషర్స్ డే’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైస్ ఛాన్సలర్ హెచ్.సుదర్శన రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థికి 4 ఏళ్ల B.Tech జీవితం ఎంతో కీలకం అన్నారు. ప్రతీ విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా అడుగులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Similar News

News September 26, 2025

తల్లి మందలించిందని కొడుకు సూసైడ్

image

అతిగా మద్యం తాగుతున్నాడని తల్లి కొడుకును మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. చిట్టూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్(24) పదేపదే మద్యం తాగుతున్నాడని తల్లి పెద్దక్క మందలించింది. రాత్రి ఇంటి నుంచి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అనంతపురానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

News September 26, 2025

ట్రాక్టర్‌ను ఢీకొని సతీశ్ చనిపోయాడు: పోలీసులు

image

పామిడి మండలం కాలాపురం సమీపంలో బుధవారం రాత్రి జి.కొట్టాలకు చెందిన వైసీపీ నేత సతీశ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొదట హత్య అని వార్తలు రాగా, ప్రాథమిక దర్యాప్తు అనంతరం సతీశ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ సాయికుమార్‌ను విచారించామని, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

News September 26, 2025

సీపీఐ జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ

image

సీపీఐ జాతీయ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ గురువారం ఎన్నికయ్యారని అనంతపురం జిల్లా నాయకులు తెలిపారు. చండీఘర్‌లో జరిగిన 25వ మహాసభలో జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాట యోధుడు రామకృష్ణ అని కొనియాడారు.