News November 30, 2025
విద్యార్థి గగన్‌ను అభినందించిన జిల్లా కలెక్టర్ సంతోష్

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న గగన్ చంద్ర నేషనల్ స్థాయిలో తను రూపొందించిన త్రీ ఇన్ వన్ హైబ్రిడ్ సైకిల్ సైన్స్ ఫెయిర్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టర్ ఆఫీస్‌లో విద్యార్థి గగన్ ను, హాస్టల్ వార్డెన్ కృష్ణయ్యను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 3, 2025
చలికాలంలో చర్మం బాగుండాలంటే?

ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద లాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే సెరమైడ్స్, షియా బటర్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. పెదాలకీ విటమిన్ ఇ, షియాబటర్ ఉన్న లిప్‌బామ్ మంచిది. ఇవి చర్మానికి తేమని, ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ కాలంలో హెవీ క్రీములు కాకుండా మీ చర్మానికి సరిపడేవి రాసుకోవాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.
News December 3, 2025
అల్లూరి: పేరెంట్స్ మీట్‌కు రూ.54.92లక్షల విడుదల

అల్లూరి జిల్లాలో ఈనెల 5న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు ప్రభుత్వం రూ.54.92 లక్షలు విడుదల చేసిందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని టీచర్స్&పేరెంట్స్ సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రతీ పేరెంట్‌కు ఆహ్వానం అందించాలన్నారు. 2,913 ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.


