News July 27, 2024
విద్యార్థి మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మరణించారన్న విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్‌లో ఉన్న మంత్రి నారాయణకు ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు మంత్రి ఆదేశించారు.
Similar News
News February 15, 2026
నెల్లూరు: లేడీస్.. బీ అలర్ట్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బంగారం ధర తులం రూ.1.60 లక్షలు దాటడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గత 6నెలల్లోనే 60కి పైగా స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా నంబర్ ప్లేట్ లేని బైకులపై వచ్చి నగలు, తాలిబొట్లు లాకెళ్తున్నారు. తాజాగా గూడూరులో ఓ టీచర్‌పై బంగారం కోసం దాడి చేయడం కలకలం రేపింది. నగలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
News February 15, 2026
నెల్లూరు: ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. ఓకే!

నెల్లూరు జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు బకాయిలు పేరుతో విద్యార్థులను కాలేజీ వాళ్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐవో వరప్రసాద్ రావు హెచ్చరించారు. ప్రభుత్వ వెబ్‌సైట్, వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్స్ సంతకం లేకున్నా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
News February 15, 2026
శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల పేర్లు తెలుసా…!

బ్రహ్మోత్సవాలు అంటే వాహన సేవలు అని తెలుసు. కానీ శ్రీకాళహస్తిలో 9 రోజులు జరిగే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. దానికి పేర్లు ఉన్నాయి. 1వరోజు దేవరాత్రి, 2వరోజు భూతరాత్రి, 3వ రోజు గాంధర్వ రాత్రి, 4వరోజు నాగరాత్రి, 5వరోజు శివరాత్రి, 6వరోజు బ్రహ్మ రాత్రి, 7వరోజు స్కంద రాత్రి, 8వరోజు ఆనంద రాత్రి, 9వరోజు ఋషి రాత్రి అంటారు.


