News February 23, 2026

విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 10 నుంచి ఎగ్జామ్స్

image

TG: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20న ఎగ్జామ్స్ ముగుస్తాయి. సమాధాన పత్రాలను ఏ రోజుకారోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల మార్కులను ISMS పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఓవరాల్‌గా 23న ఫలితాలు విడుదల చేస్తారు. అదే రోజు బడుల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.

Similar News

News February 26, 2026

అసైన్డ్ భూములు లీజుకు.. ఎకరాకు ₹31 వేలు: అనగాని

image

AP: అసైన్డ్ భూముల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్నిచోట్ల అసైన్డ్ భూములు అవసరం. అసైన్‌దారుల అనుమతితో లీజుకు తీసుకుంటాం. లీజుతో వారికి ఆదాయం వస్తుంది. ఎకరాకు ₹31వేలు చొప్పున ఇస్తాం. రెండేళ్లకోసారి 5% వరకు పెంచుతాం’ అని చెప్పారు. 10వేల MW సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, 7.5L మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.

News February 26, 2026

హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాం: CM రేవంత్

image

TG: హార్వర్డ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని గ్రూప్-1,2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో CM రేవంత్ వెల్లడించారు. ‘ఇక్కడి నుంచి హార్వర్డ్‌కు వెళ్లేందుకు చాలామందికి కష్టమవుతోంది. అందుకే MCHRD-హార్వర్డ్ మధ్య ఓ ఒప్పందం చేసుకుంటున్నాం. వాళ్లే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చెబుతారు’ అని రేవంత్ వివరించారు. ఇక ఆఫీసర్లంతా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు.

News February 26, 2026

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వలేదు: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు చేపట్టామని గ్రూప్-1,2 ఆఫీసర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారంతా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.