News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.
Similar News
News February 9, 2026
డిజిటల్ మోసాలపై కఠిన చర్యలకు SC ఆదేశాలు

డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పేర్కొంది. డిజిటల్ మోసాల ద్వారా రూ.54 వేల కోట్లకు పైగా కొల్లగొట్టడాన్ని దోపిడీగా అభిప్రాయపడింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా మోసాల నివారణకు RBI రూపొందించిన ఎస్‌ఓపీని (Standard Operating Procedure) అమలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
News February 9, 2026
కసిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

AP: సుప్రీంకోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు SC ధర్మాసనం నిరాకరించింది. రూ.750 కోట్ల కుంభకోణంలో 9నెలలుగా జైలులో ఉండటం పెద్ద సమయమేమీ కాదని CJI జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ స్కామ్‌లో ఎన్ని రూ.కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. వాదనలు వినిపించేందుకు కసిరెడ్డి తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు.
News February 9, 2026
‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.


