News April 9, 2025

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి: నిర్మల్ డీఈవో

image

ఎస్ఏ 2 పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్మల్ డీఈవో రామారావు సూచించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు పరీక్షలను నిర్వహించి పరీక్షా అనంతరం మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఈ నెల 23న పీటీఎం మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫలితాలను అందజేయాలని ఆదేశించారు.

Similar News

News October 28, 2025

MBNR: అక్కడే అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 5.8, బాలానగర్ 5.5, రాజాపూర్ 4.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 3.5, నవాబుపేట 3.0, మహబూబ్ నగర్ గ్రామీణం, మహమ్మదాబాద్ 2.5, కోయిలకొండ మండలం పారుపల్లి 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News October 28, 2025

ప.గో జిల్లాలో 583.8 మి.మీ. వర్షపాతం

image

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 583.8 మి.మీల వర్షపాత నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సరాసరి 29.2 మి.మీ కాగా అత్యధికంగా యలమంచలిలో 53.6, నరసాపురంలో 49.6, పాలకొల్లులో 49.2, ఆచంటలో 43.8, మొగల్తూరులో 42.4 మి.మీలు నమోదయింది. అత్యల్పంగా గణపవరం 13.6 మి.మీ, తాడేపల్లిగూడెం 14.0, అత్తిలిలో 16.6 మి. మీ నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.

News October 28, 2025

భద్రాద్రి: ఇక మారరా మీరు..!

image

అవినీతి నిరోధక శాఖ భద్రాద్రి జిల్లాలో యాక్టివ్‌గా పనిచేస్తున్న లంచగొండి అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు అధికారులు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసినా కొంతమంది అధికారులు తమకేమీ పట్టనట్లు చేతులు తడిపితేనే పని అన్న చందంగా ఉన్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.