News October 25, 2025
విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలి: అడ్లూరి

విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, ఇతర అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో విద్యా, వసతి, శానిటేషన్, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News October 25, 2025
KNR: జీవన్‌రెడ్డిని పక్కన పెట్టారా.? పార్టీలో చర్చ

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని అధిష్టానం దూరం పెడుతున్నట్లుగా ఇటీవల పరిణామాలు సూచిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. డా.సంజయ్‌ని పార్టీలో చేర్చుకునే ముందు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి, లైట్ తీసుకుంటున్నారనే వాదన ఉంది. తన శిష్యుడైన మంత్రి లక్ష్మణ్ వద్ద భవిష్యత్ గురించి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. క్యాడర్ కూడా సంజయ్ వెంట ఉండటంతో జీవన్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
News October 25, 2025
అన్నమయ్య: ‘అన్ని పాఠశాలల్లో స్క్వాట్ యూనిట్ తప్పనిసరి’

అన్నమయ్య జిల్లా అన్ని పాఠశాలల్లో స్క్వాట్ యూనిట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటి DIET లో శనివారం ప్రారంభమైన 7 రోజుల భారత్ స్క్వాట్ అండ్ గైడ్స్ యూనిట్ లీడర్ శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక సేవా భావాలను పెంపొందించడానికి స్కౌట్స్ తోడ్పడతాయని అక్టోబర్ 31వ తేదీ లోపు bsgindia.org లో వివరాలను నమోదు చేయాలన్నారు.
News October 25, 2025
INTER సిలబస్‌లో సమూల మార్పులు: బోర్డు

TG: ఇంటర్ సిలబస్‌ను NCERT గైడ్‌లైన్స్ ప్రకారం రివిజన్ చేస్తామని బోర్డు సెక్రటరీ కృష్ణ చైతన్య తెలిపారు. ‘గణితం, ఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీల రివిజన్ జరిగి 13 ఏళ్లయింది. ఇతర సబ్జెక్టుల రివిజనూ 2020కి ముందు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు వీటిని అప్‌డేట్ చేయాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లతో అధ్యయనం చేయించి వారి సూచనలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.


