News April 2, 2025
విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలి: DEO

రోజురోజుకి ఎండలు మండి పోతుండటంతో జిల్లాలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తాగు నీరు అందుబాటులో ఉంచాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ విద్యార్థులకు వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు ఆరోగ్యం పరంగా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News April 3, 2025
నేడు కల్వకుర్తికి హరీశ్‌రావు

కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం ముద్విన్, బోయిన్‌గుట్ట తండాల్లో ఉదయం 10 గంటలకు హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలను వారు ఆవిష్కరిస్తారని తెలిపారు.
News April 3, 2025
MHBD కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్ఓ

మహబూబాబాద్ జిల్లాకు నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వచ్చిన డాక్టర్ బి.రవి బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ఐడీఓసీలోని కలెక్టర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లాలోని అడిషనల్ కలెక్టర్లను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
News April 3, 2025
మంత్రి సీతక్క నేడి పర్యటన వివరాలు

రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు తాడువాయిలోని పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మంగపేట, ఎటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో సన్న బియ్యం పంపిణీతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6.30గంటలకు ములుగు చేరుకుంటారు.