News October 15, 2025
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్

గూడూరు మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్‌లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
Similar News
News October 16, 2025
జూరాల చేపల కూర తిన్నారా..?

మన పాలమూరు రుచుల్లో ముందుగా మనకు గుర్తొచ్చేది జూరాల చేపల కర్రీ. గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లిలోని మత్స్యకారులు బతికిన చేపలను కస్టమర్ ముందే బయటకు తీసి శుభ్రంగా కడుగుతారు. మంచి ముక్కలుగా కోసి చేపల కూర ఫ్రైచేస్తారు. చేపల కర్రీ కట్టెల పొయ్యి మీద చేయడంతో లొట్టలేసుకుంటూ పర్యాటకులు తింటారు. మరి మీలో ఎంతమంది జూరాల ఫిష్ తిన్నారు. కామెంట్ చేయండి. # నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
జగిత్యాల: ‘నూతన ఓటర్లకు ఐడి కార్డులు వెంటనే పంపిణీ చేయాలి’

నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్లకు ఐడీ కార్డుల పంపిణీని త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా, బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) నియామకంపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఏడు రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
News October 16, 2025
SRCL: ‘పెండింగ్ ఓటర్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

పెండింగ్‌లో ఉన్న ఓటర్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల జాబితా, ఇతర అంశాలపై గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం. హరిత పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని సీఈఓ సూచించారు.