News October 19, 2025
విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

నల్లమాడలోని KGBV పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. తరగతి, వంట గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ పాఠాలను బోధించారు. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 19, 2025
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోకోపైనే అందరి దృష్టి

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఇవాళ తొలి వన్డే ఆడనుంది. ODI కెప్టెన్‌గా గిల్‌కిదే తొలి మ్యాచ్ కాగా AUSను ఎలా ఎదుర్కొంటాడో అనేది ఆసక్తిగా మారింది. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. కీలక ప్లేయర్లు అందుబాటులో లేకున్నా స్వదేశంలో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ 9amకు ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.
News October 19, 2025
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు

TG: నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23 వరకు పొడిగించింది. బ్యాంకులు, నిన్న బీసీ బంద్ నేపథ్యంలో దరఖాస్తు చేయలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 23న తీయాల్సిన డ్రాను 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 30వేలకు పైగా దరఖాస్తులు రాగా మొత్తంగా 80వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు.
News October 19, 2025
ASF: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన వారు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీ కార్యదర్శుల హాజరు అంశాలపై సమీక్ష నిర్వహించారు.