News February 15, 2025
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
Similar News
News July 5, 2025
విజయవాడలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

విజయవాడలో రూ.20.31 కోట్లతో 84 అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ (వీఎంసీ) టెండర్లు ఆహ్వానించింది. డ్రైన్లు, రహదారులు, కల్వర్టులు, నీటి సరఫరా మరమ్మతులే లక్ష్యమని కమిషనర్ హెచ్‌ఎం. ధ్యానచంద్ర తెలిపారు. ఆసక్తిగల గుత్తేదారులు వివరాల కోసం https://apeprocurement.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
News July 5, 2025
ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ బదిలీ

ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్ ఆకస్మిక బదిలీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల నిర్వహణతో పాటు రెవెన్యూ సదస్సుల విజయవంతంలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని (PRRD) విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News July 5, 2025
నిజామాబాద్: రేషన్ బియ్యానికి 48,978 మంది దూరం..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.