News September 13, 2024

విద్యార్థులకు మంచి బోధన అందించాలి: మంత్రి రాజనర్సింహ

image

ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారని, వారిని తమ పిల్లలుగా భావించి బోధన చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అందోల్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో అన్నారు. త్వరలో హెల్త్ కార్డుల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రఘోత్తంరెడ్డి, గుండు లక్ష్మణ్, మాణయ్య, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 17, 2025

మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

image

హైదరాబాద్ అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

News September 17, 2025

మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

image

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.